Funky Trailer : ఫంకీ ట్రైలర్ - ప్రామిసింగ్ ఫన్ రైడ్

Update: 2026-02-07 13:57 GMT

విశ్వక్ సేన్, కయాడు లోహర్ జంటగా నటించిన మూవీ ‘ఫంకీ’. అనుదీప్ దర్శకుడు. నాగవంశీ నిర్మించిన సినిమా ఇది. ఈ నెల 13న మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే .. అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ లాగా ఉంది. ఎమోషన్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపించేలా ఉంది. పైగా కంప్లీట్ గా అనుదీప్ స్టైల్ లో సాగే సినిమాలాగా అర్థం అవుతుంది. నిజానికి ఈ తరహా కామెడీ మూవీస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతాయి. ఫంకీ కూడా అలాంటి మూవీలానే అనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం పంచ్ లతో నిండిపోయింది. సినిమా ఆసాంతం కూడా అలాగే ఉండబోతోంది అనిపించేలా ఉంది.

డాక్టర్ మా అమ్మకి ఆపరేషన్ చేయాలి అని అడిగితే.. ఆ వచ్చిన వాడు నాకు రాదు డాక్టర్ అనడం... మీకు ఇంటలిజెంట్ డైరెక్టర్ కావాల కదా.. మీరు సుకుమార్ దగ్గరకు వెళ్తాడా.. త్రివిక్రమ్ నా గురించి ఏం అన్నాడురా.. అంటే .. ఫస్ట్ టైమ్ వింటున్నా అన్నా అనడం లాంటి పంచ్ లు. తర్వాత టెంత్ లో మీరు ఫస్ట్ క్లాసా అని హీరోయిన్ అడిగితే.. కాదు టెంత్ క్లాసే అనడం విశ్వక్ సేన్ డైలాగ్.. గలీజ్ అనిపిస్తయి నాకూ.. నాకిట్ల ఓనర్ కి రెంట్ గట్టుడు అంటూ విశ్వక్ డైలాగ్ గుర్తొస్తే అనుదీప్ కనిపిస్తాడు. ఆ సైకిల్ శీను గాన్ని పిలవండ్రా అని విలన్ లాంటి పాత్రధారి అనడం.. అన్నా వాడు బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిండు అని చెప్పడం.. ఇలా.. ట్రైలర్ లోనే బోలెడెన్ని పంచ్ లు ఉన్నాయి. సినిమా మొత్తం ఈ పంచ్ లతో నిండిపోతుంది అనిపించేలా ఉంది. చూస్తుంటే అనుదీప్ మరోసారి జాతిరత్నాలకు మించి పోయేంత పెద్ద విజయాన్ని అందించబోతున్నాడు అనిపించాడు.

ఇక సినిమాలో దర్శకుడు పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడు అని అర్థం అవుతోంది. హీరోయిన్ పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. అలాగే అనుదీప్ పాత ఫ్రెండ్స్ అంతా ఈ సినిమాలో కీలక పాత్రలో తీసుకున్నాడు అనిపించేలా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్ మాత్రం హిలేరియస్ గా ఉంది. మరి సినిమా కూడా అలాగే ఉంటుంది అనిపించేలా ఉంది. 

Full View

Tags:    

Similar News