ప్రజాగాయకుడు గద్దర్ చివరిగా నటించిన ఉక్కు సత్యాగ్ర హం మూవీ ఈనెల 29న విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాత సత్యారెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరే కిస్తూ ఉక్కు సత్యాగ్రహం మూవీని స్వీయ దర్శకత్వం లో సత్యారెడ్డి నిర్మించారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సినిమా తీశామ్. ప్రపంచ వ్యాప్తం గా 300 థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించామని,గద్దర్ మరణం తో సినిమా విడుదల సెన్సార్ ఆలస్యం అయ్యింది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు,ప్రైవేటికర ణకు వ్యతిరేకంగా పోరాడేవారు ఈ సినిమాలో నటించారు. గద్దర్ సినిమాలో అరగంట పాటు ఉంటారు. స్మగ్లర్లను హీరోలుగా చూపించే సినిమాలకంటే సమా జానికి మేలు చేసే సినిమాలను ప్రజలు ఆదరించాలి' అని సత్యారెడ్డి కోరారు.