Ram Charan : యోగి ఆదిత్యనాథ్ దగ్గర నుంచి మొదలవుతున్న గేమ్ ఛేంజర్

Update: 2024-11-05 06:27 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. ఎస్.జే సూర్య, అంజలి, సునిల్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతోన్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 9న ముందుగా టీజర్ విడుదల చేయబోతున్నారు. అది కూడా లక్నో లో.

ఉత్తరప్రదేశ్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు అక్కడి సిఎమ్ యోగి ఆదిత్య నాథ్. అతనేం చెప్పినా, చేసినా దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. అలాంటి యోగి పాలిస్తోన్న ఉత్తర ప్రేదేశ్ రాజధాని లక్నో నుంచి గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈనెల ౯న ఈ టీజర్ ను ముందుగా అక్కడి నుంచే విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదలైనా.. మొదట ఎక్కడ ప్రదర్శించారు అనేది పాయింట్ కదా. ఆ పాయింట్ ప్రకారం యోగి రాష్ట్రం నుంచి రామ్ చరణ్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి.


ఇక ఈ సినిమాలో చరణ్ డ్యూయొల్ రోల్ చేశాడు. ఒక పాత్ర బ్యూరోక్రాట్ గా ఉంటే.. మరో పాత్ర పొలిటీషియన్ గా కనిపిస్తుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఇంతకు ముందు నాయక్ మూవీలో డబుల్ రోల్ చేశాడు చరణ్.ఆ తర్వాత గేమ్ ఛేంజర్ లోనే డ్యూయొల్ రోల్ చేశాడు. ఆచార్య పోయినా.. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న రామ్ చరణ్ సినిమా కాబట్టి గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి. అనేక రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ అంచనాలన్నీ అందుకునే సత్తా గేమ్ ఛేంజర్ లో ఉందా లేదా అనేది సంక్రాంతికి తెలిసిపోతుంది. 

Tags:    

Similar News