మంచి దర్శకుడు అన్న పేరుంది కానీ .. ఇప్పటి వరకూ కమర్షియల్ గా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా లేని దర్శకుడు అంటే వెంటనే క్రిష్ పేరే చెబుతారు. గమ్యంతో మొదలైన అతని ప్రస్థానం వేదం, కృష్ణంవందే జగద్గురుం, కంచె వంటి మీనింగ్ ఫుల్ మూవీస్ తో సాగుతుంది. కానీ కమర్షియల్ గా ఇవేవీ నిర్మాతలకు సంతృప్తినిచ్చినవి కాదు. బాలయ్యతో చేసిన గౌతమీపుత్ర శాతరకర్ణి కొంత వరకు ఓకే. ఆ తర్వాత చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు డిజాస్టర్ అయ్యాయి. కొండపొలంతో డిజాస్టర్ తో పాటు విమర్శలూ ఎదుర్కొన్నాడు. ఇవి కాక బాలీవుడ్ లో మణికర్ణిక అనే సగం సినిమా, తెలుగులో హరిహర వీరమల్లుతో సగం సినిమాలు చేసిన రికార్డ్ కూడా ఉంది క్రిష్ కు.
ప్రస్తుతం అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా ఘాటీ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతోందీ మూవీ. ట్రైలర్ చూస్తే ఎప్పట్లానే ఇన్సిడెంట్ బేస్డ్ మూవీగా కనిపస్తోంది కమర్షియల్ వయబిలిటీ లేదు. పైగా ప్రమోషన్స్ లో కూడా అనుష్క నట విశ్వరూపం చూపించింది అంటున్నాడు. అంటే నటనకు అవార్డులు వస్తాయి.. కానీ డబ్బులు రావు కదా. అదీ కాక ట్రైలర్ లోనే కథంతా చెప్పేయడం పెద్ద మైనస్ గానూ కనిపిస్తోంది. అటు అనుష్క కూడా ఫామ్ లో లేదు. పోస్టర్ లో థియేటర్స్ కు జనాల్ని రప్పించే ఫేస్ లు కూడా లేవు. మరి ఇన్ని మైనస్ లను దాటుకుని క్రిష్ కమర్షియల్ హిట్ కొట్టడం కొంత సవాల్ గానే చెప్పాలి. అయినా హిట్టు కొట్టాడు అంటే ఆశ్చర్యమే అవుతుంది.