యాంగ్రీమేన్ గోపీచంద్ మూవీస్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. వరుసగా పోతున్నాయి. అందుకే రూట్ మార్చాడు. ఈ సారి హిస్టారికల్ మూవీతో రాబోతున్నాడు. ఆ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు అతన్నుంచి ఒక వీడియో కూడా వచ్చింది. ఆ వీడియో చాలా పవర్ ఫుల్ పాత్రగా కనిపిస్తోంది. క్రీస్తు శకం 642వ యేడాది సాగే కథగా ఉండబోతోంది. ఆ టైమ్ లో వచ్చే కథా నేపథ్యంలో చాలా పవర్ ఫుల్ మూవీతో రాబోతున్నాడు గోపీచంద్ అనిపిస్తోంది. ఆ కాలం అంటే గుర్రాలు, రాజులు అనేది కామన్ కదా. అలాంటి ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇది. గోపీచంద్ ఈ మూవీతో చాలా పెద్ద విజయాన్ని అందుకోబోతున్నాడు అనిపించేలా ఉంది.
ఇక ఈ మూవీకి టైటిల్ ను భరతవర్ష అని పెట్టారు. ఆ టైటిల్ కథకు తగ్గట్టుగా ఉండబోతోంది అనిపిస్తోంది. భరతవర్షే అనే మాట ఇప్పటికీ తెలుగు మూవీస్ లో చాలాసార్లు వినిపించింది. ఆ టైటిల్ తో ఓ బలమైన కథ, కథనాలు మాత్రం ఉంటాయి అనేలా ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ మూవీతో అతను బాగా ఫేమ్ అయ్యాడు. తర్వాత అంతరిక్షం అనే చిత్రంతో ఆకట్టుకున్నాడు. మధ్యలో ఓ హిందీ మూవీ కూడా చేశాడు. అలాంటి తను కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అతను కూడా ఈ కథపై చాలా వర్క్ చేసినట్టుగా ఉన్నాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోందీ మూవీలో. మొత్తంగా ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది.