టెన్నిస్ ప్లేయర్ గా భారతీయ జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేసిన ప్లేయర్ సానిమా మీర్జా. ఓ రకంగా టెన్నిస్ ఆటకే వన్నె తెచ్చింది. ఆమె తర్వాత ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటవైపు వచ్చేలా ఇన్ స్పైర్ చేసింది. అనేక అంతర్జాతీయ పతకాలతో సత్తా చాటింది. అభిమానులతో టెన్నిస్ క్వీన్ అని అనిపించుకుంది. టెన్నిస్ ప్లేయరే అయినా ఓ హీరోయిన్ కు ఉండాల్సినన్ని క్వాలిటీస్, అందం ఉన్న బ్యూటీ కూడా తను. అయితే సడెన్ గా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. ఈ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. ఒక బాబు పుట్టిన తర్వాత 2024లో ఈ జంట విడిపోయింది.
విడాకులు నుంచి ఒంటరిగానే ఉంటోంది సానియా. అయితే కొన్నాళ్లుగా ఓ తెలుగు సినిమా హీరోతో తను డేటింగ్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. పైగా త్వరలోనే ఈ రిలేషన్ తో పాటు పెళ్లికి సంబంధించిన ప్రకటన కూడా వస్తుందనే రూమర్స్ ఉన్నాయి. మరి ఆ హీరో ఎవరు..? అసలు ఈ గాసిప్ లో నిజమెంత అనేది తేలాల్సి ఉంది.