రివ్యూ : సోలో బాయ్
ఆర్టిస్టులు : గౌతమ్ కృష్ణ, శ్వేత అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, భద్ర, షఫీ తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంగీతం : జుదా సంధీ
సినిమాటోగ్రఫీ : త్రిలోక్ సిద్దు
నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్
దర్శకత్వం : పి. నవీన్ కుమార్
బిగ్ బాస్ తో ఫేమ్ అయిన గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా సోలో బాయ్. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాత. నవీన్ కుమార్ దర్శకుడు. ముందు నుంచీ ఆకట్టుకునే ప్రమోషన్స్ చేశారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనేది చూద్దాం..
కథ :
కృష్ణ మూర్తి (గౌతమ్ కృష్ణ ) మిడిల్ క్లాస్ కుర్రాడు. తన తల్లితండ్రలతో కలిసి ఉంటాడు. కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అతనికి ఫైనాన్సియల్ బ్యాక్ గ్రౌండ్ లేదని పెళ్లికి నో చెబుతుంది. ఆ బ్రేకప్ నుంచి బయట పడి ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు. అక్కడ అతనికి మరో అమ్మాయి పరిచయం అవుతుంది. ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొన్ని సమస్యలు ఫేస్ చేసిన తర్వాత కృష్ణ ఆర్థికంగా ఎదగలేడు అని భావించి విడాకులు తీసుకుంటుంది. ఇలా కేవలం మిడిల్ క్లాస్ వాడు కావడం.. ఆర్థికంగా బలం లేకపోవడం వల్ల తన జీవితంలో నుంచి ఇద్దరు అమ్మాయిలు వెళ్లిపోతారు. మరి ఆ సమస్యల నుంచి అతను ఎలా బయటపడ్డాడు. తను ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ అవుతాడా..? తన లైఫ్ నుంచి వెళ్లిపోయిన అమ్మాయిలు తిరిగి అతని జీవితంలోకి వస్తారా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
సోలో బాయ్.. ఇదో ఎమోషనల్ డ్రామా. మంచి కథ, కథనం కుదిరాయి. ముఖ్యంగా యూత్ కు బాగా నచ్చే అవకాశాలున్నాయి. అలాగే యూత్ లో జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఓ కసిని రగిలించే సినిమా. రెండు లవ్ ట్రాక్స్ బావున్నాయి. పెళ్లి తర్వాత హీరో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కనిపించేవే. అందుకే ఇది ఆ వర్గం ఆడియన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. వెండితెరపై సందేశాలు ఇస్తే జనం చూస్తారా అనే ప్రశ్న ఉంది. అయితే ఆ మెసేజ్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా తోడైతే ఖచ్చితంగా చూస్తారు. అందుకు ఉదాహరణే ఈ చిత్రం అనుకోవచ్చు. బిగ్ బాస్ తో ఓ కొత్త ఇమేజ్ సంపాదించుకున్న గౌతమ్ కృష్ణ హీరోగా ఈ మూవీని సోలోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మంచి నటన చూపించాడు. ఎమోషన్స్, లవ్, రొమాన్స్, పెయిన్ .. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఆకట్టుకునే నటన చూపించాడు. ఈ తరహా కథలు మరిన్ని చేయొచ్చు అనేలా నిరూపించుకున్నాడు. నిడివి తక్కువే అయినా రమ్య పసుపులేటి పాత్ర ఆకట్టుకుంటుంది. చాలామందికి కనెక్ట్ అవుతుంది. అలాగే శ్వేతా అవస్థి నటన బావుంది. చూడ్డానికీ బావుంది. పేరెంట్స్ పాత్రల్లో అనిత చౌదరి, పోసాని మరోసారి మంచి నటన చూపించారు. ఇతర పాత్రల్లో షఫీ, భద్రం, చక్రపాణి పాత్రల మేరకు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసి మెప్పించారు.
టెక్నికల్ చూస్తే
పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కథకు తగ్గట్టుగా మంచి మూడ్ ను క్రియేట్ చేస్తూ సాగింది. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బావున్నాయి. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న మూవీని అందించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని ప్రతి ఫ్రేమ్ లోనూ అర్థం అవుతుంది. దర్శకుడు నవీన్ కుమార్ కు ఇది ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా తడబడలేదు. తను అనుకున్న పాయింట్ ను అచ్చంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో విజయం సాధించాడు కూడా.
ఫైనల్ గా : సోలో బాయ్.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
రేటింగ్ : 2.75/5