Sampoornesh Babu : ఈ శుక్రవారం అరడజను సినిమాలు విడుదలవుతున్నాయ్

Update: 2025-04-24 10:45 GMT

ఈ సమ్మర్ కూడా టాలీవుడ్ కు అస్సలు కలిసి రాలేదు. పెద్ద సినిమాలు లేవు. వచ్చినవి పెద్దగా ఆకట్టుకోలేదు. చిన్న సినిమాలే కాస్త బెటర్ గా సత్తా చాటాయి. గతవారం విడుదలైన సినిమాల్లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి టాక్ బావున్నా.. కలెక్షన్స్ లేవు. ఇక ఈ వారం సారంగపాణి జాతకం, సోదరా వంటి మూవీస్ కాస్త ప్రమోషన్స్ తో సందడి చేశాయి. ఇవే కాక ఇంకా మరో ఐదు సినిమాలు ఈ శుక్రవారం విడుదలవుతుండటం విశేషం. ఇందులో ఒకటి మళయాల డబ్బింగ్ సినిమా. అయినా ఆ చిత్రాల గురించి ఆడియన్స్ కు పెద్దగా తెలియకుండా పోయింది అంటే చిన్నవి, ప్రమోషన్స్ లేనివీ, లేదా పోస్టర్ వాల్యూ పెద్దగా లేకపోవడమే రీజన్ అని వేరే చెప్పక్కర్లేదు.

సారంగపాణి జాతకంలో ప్రియదర్శ సరసన రూపా కొడువయూర్ హీరోయిన్ గా వెన్నెల కిశోర్, వైవా హర్ష, నరేష్, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీపై మొత్తం టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది.

కొంత గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన సినిమా సోదరా. సంజోష్, ఆర్తి, ప్రాచీ బన్సల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మన్మోహన్ మేనంపల్లి డైరెక్ట్ చేశాడు. సినిమాకు సంపూ మెంటార్స్ అయిన సాయి రాజేష్, ఎస్కేఎన్ ల సపోర్ట్ చాలా ఉంది. పైగా ఎస్కేఎన్ సొంత డబ్బులతో ప్రీమియర్ కూడా వేస్తున్నాడు.

ఈ మూవీస్ తో పాటు త్రినాథరావు నక్కిన నిర్మించిన చౌర్యపాఠం చిత్రం ఉంది. ఈ మూవీకి ప్రమోషన్స్ చేశారు. కానీ ఆర్టిస్టుల్లో తెలిసిన మొహాలు లేకపోవడం పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. ఇక వీటితో పాటు సూర్యాపేట జంక్షన్, ఏఎల్ సిసి యూనివర్సల్ బ్యాచులర్, మన ఇద్దరి ప్రేమకథ వంటి చిత్రాలు ఉన్నాయి.

ఇవి కాక మోహన్ లాల్, శోభన జంటగా నటించిన తుడరుమ్ అనే మళయాల చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్ చేశారు. కానీ ఈ మూవీ గురించి పట్టించుకున్న వాళ్లే లేకపోవడం విశేషం. సో.. కంటెంట్ ఉన్నా ప్రమోషన్స్ లేకపోతే వేస్ట్ అనేలా కొన్ని సినిమాలు ఉంటే.. కంటెంట్ ఉందని చెబుతూ ప్రమోషన్స్ కూడా చేసుకుని సారంగపాణి జాతకం, సోదరా వంటి చిత్రాలకే ఈ ఫ్రైడే ఎక్కువ స్కోప్ కనిపిస్తోందని చెప్పాలి.

Tags:    

Similar News