పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. అంటే సరిగ్గా పది రోజులు మాత్రమే ఉంది. కానీ ప్రమోషన్స్ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జస్ట్ ట్రైలర్ వచ్చింది. కానీ ఆ ట్రైలర్ కు ఆశించినంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. అదే టైమ్ లో పవన్ మూవీస్ కు ప్రమోషన్స్ తో పెద్దగా పని ఉండదు. ఆటోమేటిక్ గా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనేది కూడా అందరికీ తెలుసు. బట్ ఇది ఒకప్పుడు. ఇప్పుడాయన పాలిటిక్స్ లో ఉన్నాడు. డిప్యూటీ సిఎమ్ కూడా. అంటే కావాలని నెగెటివ్ చేసేవారు కూడా చాలామందే ఉంటారు. అంచేత ప్రమోషన్స్ ఉండాల్సిందే. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తేనే క్రేజ్ వస్తుంది. లేదంటే కేవలం హీరోయిన్ తో పాటు ఇతర ఆర్టిస్టులతో లాగిస్తే వర్కవుట్ అయ్యే అవకాశాలు తక్కువ.
ఇక క్రిష్ తర్వాత సెట్స్ లోకి వచ్చాడు దర్శకుడు జ్యోతికృష్ణ. అతనూ తనకు తోచిన మార్పులు చేసుకున్నాడు అని చెప్పారు. ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ చిత్రం కోసం మొదట్లో చాలామంది ఆసక్తిగా చూశారు. అలాగే ట్రైలర్ తర్వాత వీరమల్లు, ఔరంగజేబ్ జీవన కాలాల గురించిన కాంట్రవర్శీ కూడా వచ్చింది. అది సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు అనే చెప్పాలి. మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే పది రోజులు కాదు.. నెల రోజుల ముందు నుంచే ఓ రేంజ్ లో సందడి కనిపిస్తుంది. బట్ ఈ చిత్రానికి అది కనిపించడం లేదు అనేది నిజం. అలా ఎందుకు జరుగుతోంది అనేది పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసైనికులకే తెలియాలి. అదే టైమ్ లో వీరిని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. రిలీజ్ టైమ్ కు అదరగొట్టే అవకాశమూ ఉంది.