Pawan Kalyan : హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఈ సారి పక్కా

Update: 2025-05-06 12:45 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుకు ఎట్టకేలకు మోక్షం దొరికింది. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన అయిన ఈ మూవీ ఈ సారి పక్కాగా రాబోతోంది. అందుకు కారణం.. కొన్నాళ్లుగా పవన్ కు సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఆ పార్ట్ ను రీసెంట్ గానే ఫినిష్ చేశాడు పవన్. దీంతో రిలీజ్ కు రోడ్ క్లియర్ అయింది. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ తో రెడీగా ఉంది. ఇక మిగిలింది ఈ కొంచెమే కాబట్టి రిలీజ్ కు ఇబ్బందేం ఉండదు. అందుకే పక్కా అనుకోవచ్చు.

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ జూన్ 12. నెల రోజులకు పైగా టైమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తుందీ సారి. నిజానికి ఈ నెల 30నే ప్లాన్ చేశారు. ఆ రోజు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మించింది నాగవంశీతో పాటు త్రివిక్రమ్ బ్యానర్. అందుకే వాళ్లు అదే రోజు కాకుండా కాస్త ముందుకు జరిపారు. మరో విషయం ఏంటంటే.. ఈ మూవీని పోస్ట్ పోన్ చేయడానికి ఓటిటి రైట్స్ తీసుకున్న అమెజాన్ వాళ్లు ముందు ఒప్పుకోలేదట. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 30నే విడుదల చేయాలన్నారట. కానీ పెద్దలు మాట్లాడటంతో మేటర్ సెటిల్ అయిందంటున్నారు. సో ఫైనల్ గా జూన్ 12న ఈ సారి పక్కాగా హరిహర వీరమల్లు వచ్చేస్తున్నాడు.

Tags:    

Similar News