Harish Shankar : తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి ?

Harish Shankar : తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి అంటూ ట్వీట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హరీష్ కలిశారు.

Update: 2022-02-03 06:59 GMT

Harish Shankar : తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి అంటూ ట్వీట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హరీష్ కలిశారు. ఈ సందర్భంగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు హరీష్. "మేమిద్దరం కలిసినప్పుడు ఎప్పుడూ కూడా ఓ రేంజ్‌లో ఫన్ ఉంటుంది. మనం మళ్ళీ కలిసే వరకు ఒక గ్రేట్ టైం దొరికింది అల్లు అర్జున్.. తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి?" అంటూ పోస్ట్ చేశాడు హరీష్. దీనితో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపైన త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబోలో దువ్వాడ జగన్నాధం చిత్రం తెరకెక్కింది.


Tags:    

Similar News