పుష్ప రెండు భాగాలతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా తిరుగులేని మార్క్ వేశాడు దర్శకుడు సుకుమార్. అంతకు ముందే అతను రంగస్థలంతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రంగస్థలంకు ముందు పెద్ద డైరెక్టర్ గా పేరు లేదు అతనికి. అలాంటి దర్శకుడు ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో చాలా పెద్ద దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అలాంటి డైరెక్టర్ తర్వాతి మూవీ అంటే రామ్ చరణ్ దే అని గతంలో వినిపించింది. ఇప్పుడు అదే విషయం కన్ఫార్మ్ అయింది. రామ్ చరణ్ తర్వాతి సినిమాను సుకుమార్ తో చేయబోతున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మూవీతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి 27న విడుదల కాబోతోందీ మూవీ. తర్వాత సుకుమార్ తోనే ప్రాజెక్ట్ చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ మేరకు 2026 జూన్ లోనే ఈ చిత్రం ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ కథ ఫైనల్ చేస్తున్నాడు. దీంతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాడట. ఈ మూవీని ఏడాదికిపైగా చిత్రీకరించబోతున్నారు. అంటే 2027 ఏప్రిల్ లో రిలీజ్ చేయలనుకుంటున్నారు. సో.. రంగస్థలం తర్వాత అంతకు మించిన మూవీతో రామ్ చరణ్, సుకుమార్ సిద్ధం కాబోతున్నారు.