నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో సినిమా అఖండ 2 : తాండవం. ఆల్రెడీ వచ్చిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అందుకే అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. బాలయ్య మరోసారి డ్యూయొల్ రోల్ లోనే కనిపించబోతోన్న ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ మళ్లీ రిపీట్ అవుతుంది. కొత్తగా సంయుక్త, హర్షాలీ మల్హోత్రా యాడ్ అయ్యాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్ గానే తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న బాలయ్య డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఇక ఈచిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. ఆ డేట్ కు పవన్ కళ్యాణ్ ఓ.జి కూడా విడుదలవుతోంది. అందుకే వీళ్లు కొత్త డేట్ కోసం చూస్తున్నారు అనే టాక్ వినిపించింది. అయితే ఓ.జి కోసం కాదు కానీ.. అఖండ 2లో విఎఫ్ఎక్స్ కు కాస్త ఎక్కువ స్పేస్ ఉందట. ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉందనుకున్నారు. ఆ కారణంగా బాలయ్య మూవీని డిసెంబర్ 18న విడుదల చేయబోతున్నారు అనే న్యూస్ వచ్చిందా మధ్య. తాజాగా ఈ డేట్ కూడా మారిందంటున్నారు.
ఇప్పటికైతే అఖండ 2 సెప్టెంబర్ 25న రేస్ లో లేదు అనే భావిస్తున్నారు అంతా. ఒకవేళ ఆయన బరిలో ఉంటే ఖచ్చితంగా ఓ.జి రికార్డులు తగ్గుతాయి అని చెప్పొచ్చు. ఇద్దరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే. అందుకే అటు పొలిటికల్ గానూ చూసుకున్నారు. అందుకే బాలయ్య బరి నుంచి తగ్గుతున్నాడు అనేది లేటెస్ట్ టాక్. అయితే డిసెంబర్ 18న కాకుండా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ 2నే ఫస్ట్ పార్ట్ అఖండ కూడా విడుదలైంది. కుదిరితే మళ్లీ అదే డేట్ లేదా డిసెంబర్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నారు అని సమాచారం. మొత్తంగా అఖండ 2 రిలీజ్ డేట్ మరోసారి మారబోతోందనేది కన్ఫార్మ్ అని తెలుస్తోంది. మరి దీన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.