Cross Voting in Maa Elections 2021: మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. అంటే ఏమిటి?

Cross Voting in Maa Elections 2021 : మా ఎన్నికలను ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ చాలా ప్రస్టేజ్‌గా తీసుకున్నాయి.

Update: 2021-10-10 13:14 GMT

prakash raj manchu vishnu panels (tv5news.in)

Cross Voting in Maa Elections 2021 : మా ఎన్నికలను ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ చాలా ప్రస్టేజ్ గా తీసుకున్నాయి. దీంతో దీని ఫలితాలు ఎలా ఉంటాయా అని అందరూ చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ ఇందులో క్రాస్ ఓటింగ్ భయం ఇప్పుడు రెండు ప్యానళ్లకు టెన్షన్ పుట్టించింది.

క్రాస్ ఓటింగ్ అనే పదం ఎక్కువగా జనరల్ ఎలక్షన్లలో వింటాం. కానీ మా ఎన్నికల్లో కూడా ఇలాంటి పదం వినాల్సి వస్తుందని బహుశా టాలీవుడ్ కూడా ఊహించి ఉండదు. ఒకవేళ గత ఎన్నికల్లో ఇలా జరిగినా కొద్దో గొప్పో తప్ప.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగుండదు. కాని ఇప్పుడు మాత్రం భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు.

క్రాస్ ఓటింగ్ అంటే ఒక ప్యానళ్లో కొంతమందికి.. మరో ప్యానళ్లో కొంతమందికి ఓటేయడం. అంటే.. ఒక ఓటరు మొత్తం 18 ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. సో.. విష్ణు ప్యానల్ తరపున పోటీ చేస్తున్న వారిలో కొంతమందికి ఓటేస్తే.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసే మరికొంతమందికి ఓటేయడమన్నమాట. అంటే ఒకే ప్యానల్లో పోటీ చేస్తున్న అందరికీ ఓటేయడానికి ఓటరు ఇష్టపడనప్పుడు.. రెండు ప్యానళ్లలో కొంతకొంతమందికి ఓటేస్తాడు. అప్పుడది క్రాస్ ఓటింగ్ అవుతుంది.

ఇలాంటి క్రాస్ ఓటింగ్ వల్ల ప్రాబ్లమేంటి అనుకోవచ్చు. నిజానికి దీనివల్ల పెద్ద సమస్య వస్తుంది. ఒక ప్యానల్ నుంచి అధ్యక్షుడు ఒకరైతే.. మరో ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడు మరొకరు ఎన్నిక కావచ్చు. దీనివల్ల ఆ కమిటీ పాలన కూడా అంత సజావుగా జరుగుతుందని చెప్పలేం. అందుకే క్రాస్ ఓటింగ్ ప్రభావం ఎక్కడ అధ్యక్ష స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులపై పడుతుందో అని రెండు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

మా ఎన్నికల్లో మొత్తం 905 ఓట్లకు గాను.. 883 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీరిలో 605 మంది నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశారు. మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. సో మొత్తం 665 ఓట్లు పోలైనట్లు లెక్క. వీటిలో 50 ఓట్లు చెల్లనివిగా అధికారులు పరిగణించారు. సో.. ఫైనల్ గా 615 ఓట్లు పోలైనట్టుగా తేల్చారు.

Tags:    

Similar News