Fahadh Faasil : ఇదుగో భన్వర్ సింగ్ షెకావత్ లుక్

Update: 2024-08-08 10:30 GMT

పుష్ప 1 కాస్టింగ్ లో అందరికీ నచ్చిన పేరు ఫహాద్ ఫాజిల్. మళయాలంలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ముందుకు వస్తాడు. అలా సుకుమార్ స్టోరీ చెప్పగానే పుష్ప లో నటించేందుకు ఒప్పుకున్నాడు. భన్వర్ సింగ్ షెకావత్ గా అతని ప్రెజెన్స్ సినిమాకు ఎసెట్ అవుతుందనుకున్నారు చాలామంది. బట్ ఫస్ట్ పార్ట్ చివరిలోనే కనిపించి సెకండ్ పార్ట్ కు లీడ్ గానే మిగిలిపోయాడు. ఇది ఆయన ఫ్యాన్స్ ను కాస్త డిజప్పాయింట్ చేసినా.. ఉన్నంత సేపూ మాత్రం అదరగొట్టాడు.

పుష్ప 2లో ఫహాద్ పాత్రే చాలా కీలకం. అల్లు అర్జున్ ను పట్టుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ గా అతనీ సారి కనిపించబోతున్నాడు. ఓ రకంగా పుష్పరాజ్ వర్సెస్ షెకావత్ గా ఉండబోతోంది. ఇక ఇవాళ( గురువారం) ఫహాద్ బర్త్ డే. ఈ సందర్భంగా పుష్ప 2 నుంచి అతని పోస్టర్ ను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ పోస్టర్ లో అతను పుష్ప గెటప్ లో ఉన్నాడు. మాస్ లుంగీ, కాస్త మాసిపోయిన చొక్కా, నల్లబనీయతో ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకీ పట్టుకుని ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ సారి ఫహాద్ ఫాజిల్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో తెలియడానికి. మొత్తంగా ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కు మనమూ బర్త్ డే విషెస్ చెబుదాం. 

Tags:    

Similar News