Akshay Kumar : ఈ సారి స్కై ఫోర్స్ తో వస్తోన్న అక్షయ్ కుమార్

Update: 2025-01-06 10:15 GMT

ఒక్క హిట్టు కోసం చకోర పక్షిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు అతన్ని హిట్ మెషీన్ అన్నారు. బట్ ఇప్పుడా మెషీన్ ఖరాబ్ అయింది. అందుకే చాలాకాలంగా అన్నీ ఫ్లాపులే చూస్తున్నాడు. బట్ లేటెస్ట్ గా విడుదలైన అతని కొత్త సినిమా ‘స్కై ఫోర్స్’ ట్రైలర్ చూస్తే ఈ సారి హిట్టెక్కేలానే ఉన్నాడు. సందీప్ కేవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ ద్వయం డైరెక్ట చేసిన సినిమా ఇది. అక్షయ్ తో పాటు వీర్ పహారియా అనే నటుడు పరిచయం అవుతున్నాడు. సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ మూవీ ట్రైలర్ చూస్తే టైటిల్ కు తగ్గట్టుగానే ఇండియన్ ఆర్మీలో ఒక ప్రధాన విభాగం అయిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కథ. ఇద్దరు ఆఫీసర్స్ పాక్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేస్తే దానికి ప్రతికారంగా చేసిన ప్రతిదాడిలో మిస్ అయిన ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్(వీర్ పహారియా) పాక్ కు చిక్కుతాడు. అతన్ని తీసుకు రావడానికి మరో ఆఫీసర్(అక్షయ్ కుమార్) ఏం చేశాడు.. ఇందుకోసం తన పై అధికారులను ఎలా ఎదురించాడు అనేది ప్రధాన కథలా కనిపిస్తోంది. మామూలుగా ఆర్మీ బేస్డ్ మూవీస్ కథలు అంటే ఒకే టెంప్లేట్ తో ఉంటాయి. కానీ ఆ కథను ఎంత కన్విన్సింగ్ గా చెప్పారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్ ఈ తరహా కథలను డీల్ చేయడంలో ఎప్పుడూ బెస్ట్ అనిపించుకుంటుంది. కాకపోతే కొన్నాళ్లుగా ఆ విషయంలోనూ గాడి తప్పారు. అయితే ఈ మూవీ కేవలం దాడి, ప్రతి దాడి అనే కాకుండా అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పుడు అధికారుల మాట వినకపోతే ఆఫీసర్స్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే కోణం కూడా కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ అయితే బావుంది. ష్యూర్ షాట్ అనిపించేలా ఉంది. ఈ నెల 24న విడుదల కాబోతోన్న ఈ స్కై ఫోర్స్ కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. 

Full View

Tags:    

Similar News