Allu Arjun : అల్లు అర్జున్ సూపర్ హీరో లుక్ ఇదేనా..?

Update: 2025-05-16 11:45 GMT

పుష్ప 2 తో ప్యాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత.. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ స్టార్డమ్ ను ఇంకో లెవెల్ కు తీసుకువెళ్లడమే టార్గెట్ గా అడుగులు ముందుకు వేస్తున్నాడు. అందుకే తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ను కూడా కాదనుకుని తమిళ్ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించబోతోన్న ఈ అతి భారీ బడ్జెట్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ కోసమే ఆరు నెలల వరకూ టైమ్ తీసుకుంటున్నారు. ఇది హాలీవుడ్ స్టైల్. అంటే సినిమా నవంబర్ లో షూటింగ్ కు వెళుతుంది. షూటింగ్ టైమ్ తక్కువే. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటారు. సో.. ఎలా చూసినా ఈ మూవీ 2027లోనే విడుదలవుతుంది.

ఇక ఈ మూవీ గురించి ముందు నుంచీ వినిపించేది ఏంటంటే.. మార్వెల్, డి.సి బ్యానర్స్ రేంజ్ లో ఇదీ ఓ సూపర్ హీరో సినిమా అంటున్నారు. సూపర్ మేన్, బ్యాట్ మేన్, ఐరన్ మేన్, స్పైడర్ మేన్ లాంటి వాళ్లు ఎలాగైతే దేశాలను రక్షిస్తుంటారో.. అల్లు అర్జున్ కూడా ఆ రేంజ్ లో సూపర్ హీరోలా కనిపించబోతున్నాడు అంటున్నారు. ఇండియా నుంచి క్రిష్ తర్వాత అలాంటి మూవీ రాలేదు. క్రిష్ 4కే రంగం సిద్ధం అవుతోంది. ఈ టైమ్ లో అల్లు అర్జున్ తో సూపర్ హీరో మూవీ అంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ లు బద్ధలవుతాయి అని వేరే చెప్పక్కర్లేదు.

సో.. ఈ సూపర్ హీరోకు ఓ సెపరేట్ ఫేస్ ఉంటుంది కదా. వారి రెగ్యులర్ ఫేస్ తో కనిపించరు. వారికి మనుషులను దాటి అతీతమైన శక్తులు అనేకం ఉంటాయి. అందుకే డిఫరెంట్ ఫేస్ తో కనిపిస్తారు. ఆ శక్తులు వాడనప్పుడు మళ్లీ మామూలుగానే ఉంటారు. అలా ఐకన్ స్టార్ కోసం ఈ ఫేస్ ను వాడతారు అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆ మధ్య హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియో కు వెళ్లినప్పుడు పరిశీలించారు. దీన్నే అల్లు అర్జున్ సూపర్ హీరో ఫేస్ గా వాడతారు అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఫేస్ పుష్పరాజ్ కు ఎలా ఉంటుందో కానీ.. ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉందిప్పుడు. 

 

Tags:    

Similar News