Game Changer Trailer : అదిరిపోయే లుక్ తో అప్పన్న అప్డేట్

Update: 2025-01-01 04:44 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న గేమ్ ఛేంజర్ పై రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రామ్ చరణ్ డ్యూయొల్ రోల్ చేసిన ఈ మూవీలో ఆయన సరసన కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునిల్, ఇతర కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు. రీసెంట్ గా విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేసి మెగా పవర్ చూపించారు ఫ్యాన్స్. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ తో ఈ మూవీ లుక్కే మారిపోయింది.

ఇక తాజాగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ గేమ్ ఛేంజర్ నుంచి చరణ్ చేస్తోన్న అప్పన్న పాత్ర లుక్ ను విడుదల చేశారు. పంచెకట్టులో చాలా సీరియస్ లుక్ తో దేని కోసమో పోరాడేందుకు వెళుతున్న యోధుడులా కనిపిస్తున్నాడు చరణ్. తీక్షణమైన చూపులు ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో చెబుతున్నాయి. దీంతో పాటు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చారు. రేపు(గురువారం) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ రాబోతోంది.

ఒక్కసారి ట్రైలర్ వచ్చిందంటే ఇక ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ డబుల్ అవుతాయి. ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ మూవీ రేంజ్ మారుతుందని అంచనా వేస్తున్నారు. 

 

Tags:    

Similar News