Pawan Kalyan : హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదేనా

Update: 2025-03-10 06:15 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సినిమా హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఔరంగజేబ్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు అంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటలూ జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం చేస్తున్నాడు అంటే చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. బట్ అందుకు తగ్గట్టుగా లేవా పాటలు అని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాలని నిర్మాత ఏఎమ్ రత్నం బలంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రతి అప్డేట్ తోనూ ఆ డేట్ ను వేస్తున్నాడు. బట్ ఆ టైమ్ కు రావడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది. ఇంకా కొన్ని రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఆ పార్ట్ కు విఎఫ్ఎక్స్ పార్ట్ చాలానే ఉంటుందట. తక్కువ రోజులు షూటింగే అయినా టెక్నికల్ ఎసెట్స్ కోసం టైమ్ పడుతుందని టాక్. దీనికి తోడు పవన్ కూడా డేట్స్ ఇవ్వలేపోతున్నాడు. ఈ కారణంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 28న విడుదల కాదు అని ఆల్మోస్ట్ తేలిపోయింది.అందుకే ఆ డేట్ లో నితిన్ రాబిన్ హుడ్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. మ్యాడ్ స్క్వేర్ కూడా అదే రోజు విడుదలవుతోంది. అటు మళయాలం నుంచి మోహన్ లాల్ ఎంపూరన్ తో పాటు తమిళ్ నుంచి విక్రమ్ నటించిన వీరధీర శూర విడదల కాబోతున్నాయి.

సో.. మరి హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తాడు అనేది క్వశ్చన్ మార్క్ గా ఏం మిగిలిపోవడం లేదు. ఎందుకంటే మార్చి మిస్ అవుతుంది కానీ సమ్మర్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కావడం లేదట వీరమల్లు. మాగ్జిమం అంతా సెట్ చేసుకుని మే నెల చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. సో.. సమ్మర్ లో వీరమల్లు విన్యాసాలు చూడొచ్చన్నమాట.

Tags:    

Similar News