దర్శకుడు నుంచి నటుడుగా మారాడు తరుణ్ భాస్కర్. అప్పుడప్పుడూ తనే మెయిన్ లీడ్ లో కూడా కనిపిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు హీరో అనిపించుకోలేదు. ఇప్పుడు అది కూడా కానిచ్చేస్తున్నాడు. యస్ పూర్తి స్థాయి హీరోగా మారాడు. మళయాలంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయ జయ హే మూవీ తెలుగు రీమేక్ లో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. అతని సరసన ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 1న విడుదల కాబోతోన్నఈ చిత్రానికి తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు.
ఒరిజినల్ టైటిల్ సౌండ్ గుర్తుకు వచ్చేలా తెలుగులో ‘‘ఓం శాంతి శాంతి శాంతిః’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకు ముందు 35 చిన్న కథ కాదు అనే మూవీతో ఆకట్టుకున్న ప్రొడక్షన్ హౌస్ లో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఏఆర్ సజీవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. గృహ హింసకు సంబంధించిన కథను ఎంటర్టైనింగ్ గా చెబుతూ మళయాలంలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ లో తెలుగులోనూ ఆల్రెడీ చాలామంది చూశారు. అయినా రీమేక్ అంటే కొన్ని మార్పులు ఉండే ఉంటాయి. మరి ఈ మార్పులు ఎలా ఉంటాయో కానీ.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకునేదే అవుతుందని చెప్పొచ్చు.