Hero Nikhil: అభిమానికి హీరో నిఖిల్ సర్‌ఫ్రైజ్.. స్టేజ్ పైకి పిలిచి..
Hero Nikhil: హీరో హీరోయిన్లకు అభిమానులు రకరకాలుగా ఉంటారు.. కొందరు తమ అభిమాన హీరో సినిమా రిలీజైందంటే కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు..;
Hero Nikhil: హీరో హీరోయిన్లకు అభిమానులు రకరకాలుగా ఉంటారు.. కొందరు తమ అభిమాన హీరో సినిమా రిలీజైందంటే కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు.. మరి కొందరు వీరాభిమానులు ఆ సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్నిరోజులు వరుసపెట్టి అదే సినిమా చూస్తుంటారు.. నిజానికి హీరోలు కూడా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని నటిస్తుంటారు.. అభిమానులకు గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలనుకుంటారు.
తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో నిఖిల్ అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. వేడుకకు వచ్చిన మహేశ్ అనే అభిమాని నిఖిల్ నటించిన చిత్రాలన్నీ చూశానని అతడంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. దీంతో మహేశ్‌ని స్టేజ్ పైకి పిలిచి తన కళ్లద్ధాలను గిప్ట్‌గా ఇచ్చారు.
ఈవెంట్ అనంతరం హీరో నిఖిల్‌తో ముచ్చటించిన అంశంతో పాటు తనకు కళ్లద్దాలు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేశ్.. దానికి నిఖిల్ స్పందిస్తూ.. బ్రో.. కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి.. మీరు నాపై చూపించిన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన గిప్ట్ అది అని రాసుకొచ్చారు.
చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నేచురల్ థ్రిల్లర్ కార్తికేయకు సీక్వెల్ ఇది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ద్వారకా నగర రహస్యం అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, తులసి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Thank you so much so much Anna @actor_Nikhil Anna it means a lot I Always love you ❤️ https://t.co/i5aOpBLyls pic.twitter.com/xcwza1MVLR
— Mahesh Dasari (@MaheshDasariii) June 25, 2022