ఉస్తాద్ హీరో రామ్ తమ కొత్త సినిమాను షురూ చేశాడు. సరైన హిట్ కోసం తన రూటును మార్చి కొత్తగా ట్రై చేయడానికి సిద్దమవుతున్నాడు. అందుకోసం దర్శకుడు మహేష్ బాబుతో జతకట్టాడు. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన "మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ దర్శకుడు రామ్ తో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఆవుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నడూ కనబడని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడట. మరి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రామ్ కి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.