Ravali: నన్ను ఎవరూ గుర్తుపట్టట్లేదని ఫంక్షన్స్‌కు రావట్లేదు: రవళి
Ravali: శ్రీకాంత్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ‘పెళ్లిసందడి’.;
ravali (tv5news.in)
Ravali: శ్రీకాంత్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం 'పెళ్లిసందడి'. ఈ సినిమాలో లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాలాంటి పలు అంశాలను సమపాళ్లలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆ తరం పెళ్లిసందడిని ఆదరించిన ప్రేక్షకులు ఈతరం పెళ్లిసందడిని కూడా ఆదరిస్తారని నమ్మకంతో త్వరలోనే మన ముందుకు రానున్నారు.
ఈ సీక్వెల్‌లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. తనకు జోడీగా కన్నడ బ్యూటీ శ్రీలీలా కనిపించనుంది. ఇటీవల జరిగిన పెళ్లిసందడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అప్పటి పెళ్లిసందడి నటీనటులు కూడా పాల్గొన్నారు. అందులో శ్రీకాంత్‌కు జోడీగా రవళి, దీప్తి భట్నాగర్ నటించారు. వారంతా ఈ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ముఖ్య అతిధులుగా చిరంజీవి, వెంకటేశ్ విచ్చేశారు. వారిద్దరు రవళిని మొదట గుర్తుపట్టలేదు.
ఆమె రవళి అని చెప్పేవరకు కూడా స్టేజ్‌పైన ఉన్న ఎవరూ తనను గుర్తుపట్టలేదు. 'నన్ను ఈ మధ్య ఎవరు గుర్తు పట్టని కారణంగా ఈవెంట్స్‌కి రావడం లేదని తెలిపింది. రాఘవేంద్రరావు పిలిస్తే రాలేకుండా ఉండలేకపయాను' అని స్పష్టం చేసింది రవళి. ఒకప్పుడు తన అందంతో, అభినయంతో తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు చాలా దగ్గరయిన హీరోయిన్ రవళి. ముఖ్యంగా పెళ్లిసందడిలో దీప్తి భట్నాగర్‌తో పోటీపడి నటించిన రవళికి అప్పట్లో ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ.