తను నటించిన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ కు కోపం వచ్చింది. మామూలుగా హీరోయిన్లకు చాలా కోపాలు ఉంటాయి. కానీ అందరూ చెప్పరు. అన్నిసార్లూ రియాక్ట్ కారు. కానీ దిల్ రుబా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కు కోపం వచ్చింది. తను కంఫర్ట్ గా లేని టైమ్ లో కొందరు ఫోటోస్ తీస్తున్నారు అని. ఆ కారణంగా ఆ ఫోటోలు కాస్త బ్యాడ్ గా కనిపిస్తాయని.. దీంతో తమ గురించి జనం చీప్ గా అనుకుంటారు అనే భావన ఆ హీరోయిన్ లో కనిపించింది. అందుకే అలా ఫోటోస్ తీయడం కరెక్టేనా అంటూ వేదికపైనే అందరినీ అడిగేసింది. నిజానికి అక్కడ ఉన్న హీరో కిరణ్ అబ్బవరం ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు అనిపిస్తుంది. బట్ ఒక అమ్మాయి ఇబ్బంది పడింది కాబట్టి అతనూ సైలెంట్ గానే ఉన్నాడు.
కాకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా కనిపిస్తే చేతిలో ఫోన్ ఉన్న కామన్ పీపులే కాదు.. చేతిలో కెమెరా ఉన్న కొందరు వీడియో/ ఫోటో జర్నలిస్ట్ లు కూడా అదే పనిగా ఎగబడతారు అనేది నిజం. నిజానికి వీళ్లు ఫోటోస్ తీసుకోవడానికి కావాల్సినంత టైమ్ ఇస్తారు వాళ్లు. కానీ ముందు తామే తీయాలనే పోటీ తత్వపు ఆరాటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఎవరైనా కొంత సంయమనం పాటించడం అవసరం. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించేలా చేసే ఏ వృత్తి అయినా అనైతికమే అవుతుంది.
అయితే ఈ వ్యవహారం అంతా కలిపి ఓ సీనియర్ జర్నలిస్ట్ కు చుట్టుకోవడం విశేషం. రుక్సర్ అన్నది ఆ జర్నలిస్ట్ నే అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతున్నారు జనం. దీంతో హీరో కూడా తిరిగి రుక్సర్ అన్నది ఆ జర్నలిస్ట్ ను ఉద్దేశించి కాదు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆమెను ఫోటోస్ తీస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను.. ఆ టైమ్ లో సదరు జర్నలిస్ట్ లేడు అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.
మరి అంతమంది ఉండగా.. ఆ జర్నలిస్ట్ నే ఎందుకు అన్నారు అంటే.. ఇతగాడు ప్రతి ఈవెంట్ లో కేవలం హీరోయిన్లు అలా ఇబ్బందిగా ఉన్నప్పటి ఫోటోస్ మాత్రమే తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాడు కాబట్టి. ఇదే విషయమై ఆ మధ్య దర్శకుడు హరీష్ శంకర్ కూడా మనోడిని బాగా ఆడుకున్నాడు.. ఓ ఇంటర్వ్యూలో.