పవన్ కళ్యాన్ ఓ.జి మూవీ టికెట్ ధరలను పెంచడంపై తెలంగాణ హై కోర్ట్ స్టే ఇచ్చింది. ఇలా పెంచడానికి లేదు నార్మల్ రేట్స్ కే టికెట్స్ అమ్మాలని తీర్పునిచ్చింది. ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జి.వోను కూడా కొట్టివేసింది. తెలంగాణలో ఓ.జి టికెట్ ధరలను ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు వరకూ 800 రూపాయల వరకూ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ మేరకు ప్రీమియర్ ను ఏర్పాటు చేసిన అన్ని థియేటర్స్ లోనూ టికెట్స్ ను అమ్మేస్తున్నారు. నిజానికి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే వేలల్లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ టైమ్ లో హైకోర్ట్ స్టే ఇవ్వడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు. కాకపోతే గురువారం నుంచి కోర్ట్ తీర్పు అమలయ్యే అవకాశం ఉంది.
ఇక సుజీత్ డైరెక్ట్ చేసిన ఓ.జి పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి మొదటి రోజు రికార్డ్ స్థాయిలో వసూళ్లు రావాలనే ఉద్దేశ్యంలో మిరాయ్ ప్రదర్శిస్తోన్న థియేటర్స్ అన్నీ కూడా ఓ.జికే కేటాయించాడు నిర్మాత విశ్వ ప్రసాద్. తాజాగా బన్నీ వాస్ కూడా లిటిల్ హార్ట్స్ ప్రదర్శిస్తోన్న థియేటర్స్ ను కూడా ఓ.జికే ఇచ్చేశాడు. ఇవన్నీ చూస్తుంటే మూవీ ఈజీగా మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఫుల్ రన్ లో 300 కోట్లకు పైగా వసూలు చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.