Hit 2 success meet: వాల్ పోస్టర్ బ్యానర్.. విభిన్న చిత్రాలకు వేదిక: నానీ
Hit 2 success meet: నేచురల్ స్టార్ నానీ మంచి హీరోనే కాదు.. మంచి నిర్మాత కూడా. ఇప్పటికే తన బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే.;
HIT 2 Success Meet: నేచురల్ స్టార్ నానీ మంచి హీరోనే కాదు.. మంచి నిర్మాత కూడా. ఇప్పటికే తన బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. విభిన్న కథాంశాలకు వేదిక వాల్ పోస్టర్ బ్యానర్ అని హిట్ 2 సక్సెస్ మీట్లో నానీ చెప్పారు.
అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ 2ని నానీ నిర్మించి తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది హిట్ 2. నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన సమయంలో తనను ఎంతో మంది భయపెట్టారని అన్నారు.
నటుడిగా తాను బిజీగా ఉన్న తన టీమ్ కష్టపడి పని చేయడం వల్లే సినిమా సాఫీగా పూర్తైందని అన్నారు. అడవి శేష్ కష్టపడి పనిచేసే వ్యక్తి అని, అతడి సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ విజయవంతం కావడానికి అదే కారణమని అన్నారు. తన బ్యానర్‌లో వస్తున్న సినిమాలు చూసి ఇలాంటివి ఎవరు చూస్తారు, ఇలాంటివి చేస్తే వర్కవుట్ అవుతుందా అని ఎంతో మంది భయపెట్టారు. డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయట్లేదు. ప్రేక్షకులు ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో చేస్తున్నా. ఇప్పుడు అదే నిజమవుతుంది అని నానీ అన్నారు.
ఏడు విభిన్నమైన కధలతో హిట్ వర్స్‌ను సృష్టిస్తున్నారు శైలేష్ కొలను. మొదటి కథకు విశ్వక్ సేన్ హీరో అయితే, రెండో కథకు అడవి శేష్, మూడో కధకు నానీ హీరో.