Bhairavam Trailer : భైరవం.. గట్టిగానే కొట్టేలా ఉన్నారుగా

Update: 2025-05-19 07:47 GMT

రీమేక్స్ చేయడం ఎంత రిస్కో.. అంతే సులువు కూడా. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒరిజినల్ కు మించిన బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. ఈ నెల 30న విడుదల కాబోతోన్న భైరవం ట్రైలర్ చూస్తే ఈ బ్లాక్ బస్టర్ పడేలానే ఉందంటున్నారు చాలామంది. బెల్లంకొంద సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ మూవీ లాస్ట్ ఇయర్ తమిళ్ లో వచ్చిన గరుడన్ కు రీమేక్. నాందితో మెప్పించిన విజయ్ కనకమేడల ఈ రీమేక్ ను హ్యాండిల్ చేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అతను ఒరిజినల్ కు మించిన ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ను జొప్పించాడని అర్థం అవుతోంది. ప్రతి పాత్రకూ ఖచ్చితమైన ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాడు. ముగ్గురు హీరోలను వారి ఇమేజ్ లకు తగ్గట్టుగానే చూపించాడు. కానీ శ్రీనివాస్ పాత్రను కాస్త బెటర్ చేసినట్టు కనిపిస్తోంది.

దేవాదాయ శాఖ, భూములు, వ్యక్తిగత కక్షలు, స్నేహితుల మధ్య వైరం, వెన్నుపోటు ఈ తరహా పాయింట్స్ తో ఈ చిత్రం ఒరిజినల్ లో కనిపిస్తుంది. ఇక్కడా అదే ఉంది. కాకపోతే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినట్టు అర్థం అవుతోంది.ముఖ్యంగా డైలాగ్స్ లోని ఇంటెన్సిటీ చూస్తుంటే గూస్ బంప్స్ అలానే ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇక సినిమాలో ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ముగ్గురికీ ఫీమేల్ లీడ్ ఉంది. ఆ ఫీమేల్ రోల్స్ కూ ప్రాధాన్యత ఉండేలా ఉంది. అలాగే జయసుధ పాత్రా కీలకమే అనేలా ఉంది. ఏదేమైనా ట్రైలర్ తో భైరవం కమర్షియల్ లెక్కలు మారిపోతాయని చెప్పొచ్చు. బిజినెస్ పరంగానూ నెక్ట్స్ లెవల్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఒకే సినిమాతో ముగ్గురికీ హిట్టు పడటం ఖాయం అనేలా ఉంది ట్రైలర్. బట్ ఇలా సూపర్బ్ అనిపించిన ట్రైలర్స్ అన్నీ సినిమాలుగానూ అలాగే ఉండాలనేం లేదు కదా. 

Full View

Tags:    

Similar News