తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు. జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైదీప్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.