పవన్ కళ్యాణ్ సినిమాకి కథ రాయాల్సి వస్తే..: విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.;
ప్రముఖ రచయిత, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనో డైనమెంట్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తారు. బుల్లి తెరపై ఆలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాకి కథ రాసే అవకాశం వస్తే ఏ కథని ఎంచుకుంటారు అని అడగ్గా.. ఆయన ఒక డైనమైట్. ప్రత్యేకంగా కథ రాయడం ఎందుకు. ఆయన నటించిన సినిమాల్లో నుంచి కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుంది.
ఆయనను చూడడానికే జనం వచ్చేస్తారు. ఆయనే ఓ పెద్ద డైనమైట్ కథ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అని విజయేంద్ర ప్రసాద్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
వెంటనే ఆలీ మరి మహేష్ బాబుకో అని అడగ్గా ఆయనకి కథ రాయాలంటే పూరీ జగన్నాథ్ దగ్గరకు వెళ్లాల్సిందే అని చెప్పారు.