Inspector Rishi 2 : ఇన్స్ పెక్టర్ రిషి 2 కూడా స్టార్ట్ అయిందే

Update: 2025-12-27 12:07 GMT

ఇన్స్ పెక్టర్ రిషి సీజన్ 1 చూడని వాళ్లంతా ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ స్థాయిలో ఉంటుందా మూవీ. బలమైన కథ, కథనాలతో ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్స్ మాత్రం అదిరిపోతాయి. జేఎస్ నందిని డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సెకండ్ సీజన్ కూడా రాబోతోంది. నవీన్ చంద్ర హీరోగా సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలిని జీవరత్నం, కుమరవేల్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఇది. ఫస్ట్ సీజన్ విషయంలో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఆకట్టుకునే మూవీ ఇది. దీనికి ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ లో అమెజాన్ ప్రైమ్ లోనే హిట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అదే స్థాయిలో రూపొందబోతోంది.

ఒకానొక ఫైటింగ్ సీన్ లో ఒక కన్ను పోగొట్టుకుంటాడు ఇన్స్ పెక్టర్ రిషి. ఆ ప్రయత్నంలో అతని గాళ్ ఫ్రెండ్ కూడా చనిపోతుంది. ఒక కన్ను ఉన్నవాడు అనే కారణంతో అతను దట్టమైన అడవిలోకి ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఆ అడవిలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను ఛేదించే క్రమంలో అతను చేసిన సాహసాలు ఏంటీ అనేది ఇన్స్ పెక్టర్ రిషి ఫస్ట్ సీజన్ లో కనిపిస్తుంది. సెకండ్ సీజన్ లో మరెన్ని కారణాలతో కనిపిస్తుందా అనేది చూడాలి.

ఇప్పటికైతే 50రోజులు షూటింగ్ కూడా పూర్తయింది. మిగతా షూటింగ్ కూడా చాలా వేగంగా చేయబోతున్నారు. మొత్తంగా ఈ సెకండ్ సీజన్ లో ఇంకెన్ని అడ్వెంచర్స్ ఉంటాయో అనేది తెలియాలి.

Tags:    

Similar News