'ఏ..కా..డా..'.. 'కొత్త బంగారు లోకం'లో స్వప్నకి డబ్బింగ్ చెప్పింది ఈమె..!
Haritha Ravuri : వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'కొత్త బంగారు లోకం'.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు;
Haritha Ravuri : వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'కొత్త బంగారు లోకం'.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాలో స్వప్న పాత్రలో నటించిన శ్వేతా బసు ప్రసాద్‌కి ఇదే మొదటి సినిమా కావడం విశేషం.. ఈ సినిమాలో ఆమె చెప్పే సంబాషణలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా' ఏ..కా..డా..' అంటూ సరదాగా ఆట పట్టించే అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగోపోయింది.
అయితే ఆమెకి డబ్బింగ్ చెప్పింది హరిత రావూరి.. శ్వేతాబసు నుంచి మొన్న వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలో పూజా హేగ్దే వరకు ఆమె డబ్బింగ్ చెప్పి తన గొంతుతో మాయ చేసింది. హరిత పిన్ని డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో ఆమెకి ఈ రంగంవైపు వచ్చేందుకు ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడప్పుడు సరదాగా చిన్నచిన్న పాత్రలకి డబ్బింగ్ చెప్పేది. డీగ్రీ చేస్తున్న టైంలో ఫస్ట్ టైం కొత్త బంగారులోకం సినిమాలో హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పింది. ఇది సక్సెస్ కావడంతో ఆమెకి అవకాశాలు ఫుల్ గా వచ్చాయి.
కొద్దికాలంలోనే అమె బిజీ అయిపొయింది. నచ్చావులే, జెర్సీ, మహర్షి సినిమాలకి గాను అవార్డులను సైతం అందుకుంది. ఈ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హరిత. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ కూడా ఆమె డబ్బింగ్ చెప్పారు. గుంజన్ సక్సేనాలో జాన్వీకపూర్‌కి డబ్బింగ్ చెప్పింది.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కి తలైవి సినిమా కోసం తమిళ్, తెలుగు బాషల్లో డబ్బింగ్ చెప్పింది. ముందుగా దీనికోసం ఏకంగా డెబ్బై మంచి టెస్ట్ చేసి ఫైనల్‌గా హరితను తీసుకున్నారట. కాగా ఇప్పటివరకు ఈమె.. ఇలియానా, తమన్నా, శృతిహాసన్, రకుల్, పూజాహెగ్డేలకి డబ్బింగ్ చెప్పింది.