ఇరా-నూపూర్ సంగీత్.. మాజీ భార్యతో అమీర్ పాట కచేరీ
అమీర్ ఖాన్, కిరణ్ రావు, వారి కొడుకు ఆజాద్ కలిసి ఇరా నూపూర్ సంగీత్ వేడుకలో సందడి చేశారు. 'ఫూలోన్ కా' పాట పాడి ఇరాకి అంకితం చేశారు.;
అమీర్ ఖాన్, కిరణ్ రావు, వారి కొడుకు ఆజాద్ కలిసి ఇరా నూపూర్ సంగీత్ వేడుకలో సందడి చేశారు. 'ఫూలోన్ కా' పాట పాడి ఇరాకి అంకితం చేశారు.అమీర్ ఖాన్, రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్ వివాహం ఈరోజు జనవరి 10న ఉదయపూర్‌లో ఘనంగా జరగనుంది. ఇరా, నుపుర్ శిఖరే వారి బంధువులు మరియు సన్నిహితులతో కలిసి ఇప్పటికే లేక్స్ సిటీలో ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలను జరుపుకుంటున్నారు. జనవరి 9 న సంగీత్ ను నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇరా-నూపూర్ వెడ్డింగ్ గురించి మరింత సమాచారం
ఇరా ఖాన్, నుపుర్ శిఖరేల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. దంపతులు, వారి కుటుంబాలు మరియు స్నేహితులతో జనవరి 6 నుండి ఉదయపూర్ రావడం ప్రారంభించారు. వివరాల ప్రకారం, వధూవరుల కుటుంబాలు మరియు అతిథుల కోసం 176 హోటల్ రూములు బుక్ చేశారు. జనవరి 10న జరిగే రాయల్ వెడ్డింగ్‌కు దాదాపు 250 మంది హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇరానూపూర్ రిసెప్షన్ జనవరి 13న ముంబైలో జరగనుంది.