కొన్ని కాంబినేషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తోంది. అలాంటిదే బాలయ్య, బోయపాటిలది. నందమూరి బాలకృష్ణ అంటే ఈ మధ్య వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. డబుల్ హ్యాట్రిక్ తో హిట్స్ తోనే ఉన్నాడు. అఖండ 2 తో మరో విజయాన్ని కూడా అందుకున్నాడు. అయితే అఖండ 2 విషయంలో మాత్రం బోయపాటి శ్రీను విషయంలో కాస్త ఓవరాక్షన్ చేశాడు అనే టాక్ కూడా ఉంది. అది కాస్త తగ్గించుకుని మూవీ చేసి ఉంటే ఈ మూవీ మరింత పెద్ద విజయం సాధించి ఉండేదో అనే భావన కూడా ఉంది. బట్ అవన్నీ ఎలా ఉన్నా.. బోయపాటి తర్వాతి మూవీ కూడా బాలయ్యతోనే ఉండబోతుందో అనే టాక్ వినిపిస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను ఓ సినిమా చేసి ఉండాల్సి ఉంది. ఈ మేరకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు అల్లు అరవింద్. కాకాపోతే చాలా కాలం అవుతోంది ఇచ్చి అనే మాట ఉంది. అయితే ఇప్పట్లో బోయపాటి మరో సినిమా చేసే ఛాన్స్ లేనట్టు కనిపిస్తోంది. అదే టైమ్ లో అతను గతంలో అల్లు అర్జున్ తో కూడా ఓ మూవీ స్టోరీ లైన్ కూడా చెప్పి ఉన్నాడు. కాకపోతే ఐకన్ స్టార్ లైన్ మార్చేశాడు కదా.
అదే టైమ్ లో గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ కూడా ఓ మూవీ చేసి ఉండాల్సి ఉంది. అదేదో బోయపాటితోనే చేసి ఉంటే బావుండు కదా అనే భావన కలిగిందట అల్లు అరవింద్ కే. అందుకే ఈ కాంబినేషన్ లో మరో సినిమా కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సింపుల్ గా చూస్తే ఇప్పుడు బాలయ్య కమిట్మెంట్స్ వల్ల లేట్ అవుతుంది. అందుకే 2027లో బోయపాటి మరోసారి బాలయ్యతో మూవీ చేయొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం.. మరి బోయపాటి ఈ సారి తన దూకుడు కాస్త తగ్గించి ఉంటే బావుంటుందేమో.