Surekha Vani: ఈ వయసులో అవన్నీ అవసరమా.. సురేఖ వాణిపై ట్రోల్స్

Surekha Vani: సెలబ్రిటీలు వారి ఇష్టాలకు వారు ఉండడానికి వీల్లేదు.. ఏ చిన్న సంతోషము, సరదా అయినా షేర్ చేసుకుందామని ముచ్చటపడేవాళ్లకి చీవాట్లు పడుతున్నాయి నెటిజన్స్ చేతిలో..

Update: 2022-05-30 08:45 GMT

Surekha Vani: సెలబ్రిటీలు వారి ఇష్టాలకు వారు ఉండడానికి వీల్లేదు.. ఏ చిన్న సంతోషము, సరదా అయినా షేర్ చేసుకుందామని ముచ్చటపడేవాళ్లకి చీవాట్లు పడుతున్నాయి నెటిజన్స్ చేతిలో.. కొందరైతే మరీ శృతి మించి ట్రోల్ చేస్తుంటారు.. అయితే వాటిని వాళ్లేమీ సీరియస్ గా తీసుకోరు.. మీ ఇష్టం అని వదిలేస్తుంటారు.

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి నెటిజన్స్ చేతిలో ట్రోల్స్ కి గురైంది. కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్స్ వీడియోలు, డబ్ స్మాష్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.. ఇద్దరూ కలిసి జాలీగా టూర్లు తిరుగుతుంటారు.. తాజాగా ఆమె చేసిన ఓ వీడియోపై నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు.

అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోని తెలుసా తెలుసా సాంగ్ కు లిప్ సింక్ చేస్తూ ఊయల ఊగుతూ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఆంటీ అవసరమా ఈ పాట మీకు, ఈ ఏజ్ లో మీకు ఇలాంటి అవసరమా, మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇలాంటివి తగ్గించండి.. లేదంటే మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చేవాడు మిమ్మల్ని చేసుకుంటాడు.. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్.. అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు వావ్, సూపర్, బ్యూటిఫుల్ అంటూ సురేఖ వాణిపై అభిమానం కురిపిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News