విక్టరీ వెంకటేష్ వరుసగా మూవీస్ చేస్తున్నాడు. ఈ మధ్య బ్లాక్ బస్టర్స్ కూడా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడితో చేసిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీలో కూడా కీలక పాత్రతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం - ఏకే 47 మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని చాలా వేగంగా చిత్రీకరించబోతున్నారు. అందుకే ఈ సమ్మర్ లోనే విడుదల చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీలోనే మరో హీరో ఉండబోతున్నాడు.
రీసెంట్ గా వెంకటేష్ తో పాటు తమిళ్ హీరో కార్తీ నటించబోతున్నాడు అనే టాక్ వచ్చింది. అతనితో పాటు ఫహాద్ ఫాజిల్ కూడా ఉంటాడు అన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండబోతున్నారు అన్నారు. బట్ ఫైనల్ గా ఆ పాత్రకు ఫహాద్ ఫాజిల్ ను వరించింది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఫహాద్ అయితే పుష్ప 2 లో కీలక పాత్రలో నటించాడు. అతను చెప్పిన డబ్బింగ్ కూడా ఆకట్టుకుంది. అతను ఈ మూవీలో వెంకటేష్ తో పాటు కీలక పాత్రలో నటించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఆల్రెడీ అతనికి కథ కూడా వినిపించాడు అనిల్ రావిపూడి అని టాక్. మరోవైపు ఇంకా కథ కంప్లీట్ కాలేదు అని అనిల్ చెబుతున్నాడు.
మొత్తంగా ఈ కాంబినేషన్ మాత్రం క్రేజీగా ఉండబోతోంది. అన్నట్టు ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికే విడుదల చేయబోతున్నాడు అనిల్. అంటే సంక్రాంతి హిట్స్ డైరెక్టర్ గా అని ఆల్రెడీ పేరు పడింది. కాబట్టి ప్రతి యేడాదీ సంక్రాంతికి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది అతనికి.