పేరులో ఏముందీ అంటారు కానీ.. టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆడియన్స్ రీచ్ అవుతుంది. అది ఏ మాత్రం కాంప్లికేటెడ్ గా ఉన్నా కష్టం అవుతుంది. ఓ మంచి టైటిల్ ను సెన్సార్ వాళ్లు వద్దన్నారు వీళ్లు 'ఇట్స్ కాంప్లికేటెడ్' అన్నారు. బట్ ఆడియన్స్ కు అది అర్థం కాలేదు. అందుకే మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా..? స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఓల్డ్ మూవీకి సంబంధించి న్యూ టైటిల్ కథ.
కృష్ణ అండ్ హిజ్ లీల పేరుతో కొన్నాళ్ల క్రితం సిద్ధు ఓ సినిమా చేశాడు. అప్పట్లో పాండమిక్ కారణంగా ఆ చిత్రాన్ని ఓటిటిలో వదిలారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కుర్రాడు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడే తీరును యూత్ ఫుల్ గా చెప్పాడు దర్శకుడు రవితకాంత్ పేరేపు. ఈ చిత్రాన్ని ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదల చేశారు. ఈ సారి రానా సీన్ లోకి దిగాడు. విపరీతమైన ప్రమోషన్స్ చేశాడు. ప్రాపర్ థియేట్రికల్ రిలీజ్ లా ప్రమోట్ చేశారు. బట్ ఈ మూవీ టైటిల్ వీరికి పెద్ద మైనస్ అయింది.
థియేటర్స్ కు కృష్ణ అండ్ హిజ్ లీల టైటిల్ ను సెన్సార్ వాళ్లు యాక్సెప్ట్ చేయలేదట. దీంతో ఈ చిత్రానికి "ఇట్స్ కాంప్లికేటెడ్" అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ తో ఉన్న పోస్టర్స్ కూడా కాంప్లికేటెడ్ గానే ఉన్నాయి. అస్సలే మాత్రం అర్థమయ్యేలా లేవు. దీంతో యూత్ కూడా ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే డిజే టిల్లు మూవీస్ తో యూత్ లో విపరీతమైన పాపులారిటీ వచ్చినా.. అది ఈ సినిమాకు ఉపయోగపడకపోవడానికి కారణం టైటిలే అంటున్నారు. అయితే ఈ టైటిల్ ను ఇప్పుడు మార్చడానికి లేదు. డిజైన్స్ మార్చేంత టైమ్ లేదు. సో.. ఇదింతే అనుకోవడమేనేమో. బట్ ఈ మూవీ మాత్రం చాలా బావుందని ఓటిటి టైమ్ లోనే మంచి రివ్యూస్ వచ్చాయి. థియేటర్స్ కు అవి మిస్ అవుతున్నాయి.