పెద్ది మూవీకి సంబంధించి ఒక్కోటి రివీల్ చేస్తుండటం మాత్రం దర్శకుడు బుచ్చిబాబు క్రెడిట్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన పాట సూపర్ హిట్ అయింది. అంతకు ముందే గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ ఢిల్లీలో కనిపించిన వ్యక్తిలా ఉండేలా లుక్స్ కొన్ని ‘లీక్’ చేశారు. బట్ వీటన్నిటికీ మించి అనిపించేలా ఉంది.. జగపతిబాబు లుక్. అప్పలసూరిగా కనిపించబోతున్న జగపతిబాబు లుక్ చూసి మైండ్ బ్లోయింగ్ అంటున్నారు చూసినవాళ్లంతా. అసలు అతను జగపతి బాబేనా అని చాలామంది అడుగుతున్నారు. అతని మేకోవర్ చూసి చాలామంది స్పెట్ బౌండ్ అయిపోయారు. ఆ స్థాయిలో ఈ పాత్రను రూపు దిద్దడం అంత ఈజీనా అనిపించేలా ఉంది.
ఈ పాత్రలో జగపతిబాబు నటన మాత్రం హైలెట్ అవుతుంది అనిపించేలా ఉంది. అతనిలో ఆవేదన, ఆక్రోషం, ఆవేశం, నిస్సహాయత, ఉద్వేగం.. లాంటి అన్ని ఎమోషన్స్ కనిపించేలా ఈ లుక్ లోనే ఉండటం హైలెట్ అవుతోంది. ఈ మూవీ గురించి ఎలా ఉన్నా జగపతిబాబు పాత్ర మాత్రం చాలా గొప్పగా ఉండబోతోంది అనిపించేలా ఉంది. అతని నటన జీవితంలో ఓ మైలురాయిలా అవబోతోందనిపిస్తోంది. మొత్తంగా జగపతిబాబు అప్పలసూరిగా కనిపించబోతున్నాడు... ఈ మూవీలో.