Vijay Devarakonda : రౌడీకి రాజశేఖర్ హెల్ప్ అవుతాడా..?

Update: 2025-09-23 05:00 GMT

కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు విజయ్ దేవరకొండ. తన ఇమేజ్ కు తగ్గట్టుగా రౌడీ హీరో అనిపించుకున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత ఆ స్థాయి విజయాలు రావడం లేదు. ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నంలో చేసిన కింగ్ డమ్ కూడా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో రాబోయే రెండు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. వీటిలో ప్రధానంగా కనిపిస్తోన్న సినిమా దిల్ రాజు నిర్మిస్తోన్న 'రౌడీ జనార్ధన్'. రాజా వారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అని ముందే చెప్పేశారు. విజయ్ కి ఈ నేపథ్యంలో సినిమా మొదటి సారి. అందుకే ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ రౌడీ జనార్ధన్ కు విలన్ గా యాంగ్రీమేన్ రాజశేఖర్ విలన్ గా నటించబోతున్నాడు అనే టాక్ తాజాగా వినిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా రాజశేఖర్ విలన్ గా మారేందుకు ఫైనల్ గా ఒప్పుకున్నాడు అంటున్నారు. అదే నిజమైతే రౌడీ జనార్ధన్ కు అతనో పెద్ద ఎసెట్ అవుతాడు అనుకోవచ్చు. అదే టైమ్ లో గతంలో ఆయన నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ లో ఆయన చేసిన పాత్ర సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. సరికదా తనకు టైలర్ మేడ్ అయిన పోలీస్ పాత్రలో రాజశేఖర్ చాలా పేలవంగా కనిపించాడు. కాకపోతే మేకోవర్ అనేది దర్శకుడిని బట్టి ఉంటుంది. సో.. సరైన మేకోవర్ పడి, పాత్రలో దమ్ముంటే రాజశేఖర్ కూడా అదరగొడతాడు. సో రాజశేఖర్ వల్ల విజయ్ దేవరకొండకు పవర్ ఫుల్ విలన్ దొరికినట్టే అనుకోవచ్చు.ఈ పవర్ సినిమాకు ప్లస్ అయితే అది ఫైనల్ గా కలిసొచ్చేది రౌడీ హీరోకే. 

Tags:    

Similar News