మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ మన శంకరవర ప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది ఈ మూవీ. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అనిల్ నుంచి ఇప్పటి వరకు అపజయం అంటూ లేదు. అన్నీ హిట్స్ మూవీయే ఇస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఓ పాట విడుదల చేశారు. ఆ పాట సూపర్ హిట్ గా నిలిచింది. సిట్యుయేషనల్ సాంగ్ లా ఇది బ్లాక్ బస్టర్ అయింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో పాట కూడా విడుదల చేసింది మూవీ టీమ్. అయితే ఈ పాట మాత్రం ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ కంటే బావుంది అనే టాక్ వస్తోంది.
‘శశిరేఖా ఓ మాట చెప్పాలి.. చెప్పాక ఫీల్ కాక.. ఓ ప్రసాదూ మోహమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఏమీ కాదు.. ’ అంటూ మొదలైంది పాట. శశిరేఖా నీ చుట్టూ బిలియన్స్ నా వన్నీ ఇఎమ్ఐస్ అంటూ సాగుతుంది పాట. మామూలుగా ఓ ఓ సాధారణ అమ్మాయితో ప్రేమలో పడిపోయిన కుర్రాడి పాటలా కనిపిస్తోంది. చిరంజీవి ఏజ్ కు తగ్గట్టుగా ఇంకా అతను పెళ్లి చేసుకోవాల్సి ఉంది అనేలా ఉంది పాట. పాట సాధారణంగా ఉంది. అంతగా మెరుపులు ఏం లేవు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ.. ఈ గీతాన్ని కూడా పాడాడు. తనతో పాటు మధుప్రియ ఫీమేల్ లీడ్ లో పాడింది. మొత్తంగా సింపుల్ గా ఉంది పాట. కాకపోతే సినిమాలో మాత్రం ఆకట్టుకునేలా ఉంది గీతం.
ఇక మెగాస్టార్ తో పాటు అనిల్ రావిపూడి మూవీ అంటే మాగ్జిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు వెంకటేష్ ఓ కీలక పాత్రలోనూ కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో విడుదల కాబోతోన్న ఈ మూవీ మాత్రం అనిల్ రావిపూడి శైలిలో సాగే మరో బ్లాక్ బస్టర్ లా అనిపిస్తోంది.