Couple Friendly Movie : కపుల్ ఫ్రెండ్లీ కపుల్ మళ్లీ వస్తోందా..?

Update: 2026-02-16 07:59 GMT

కపుల్ ఫ్రెండ్లీ మూవీ.. ఈ నెల 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదలైన మూవీ. సినిమా చాలా బావుంది. ఈ జెనరేషన్ కు తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్ అన్ని జెనరేషన్స్ కు నచ్చేలా సెకండ్ హాఫ్ ఉంది. ఓ రకంగా ఈ మధ్య కాలంలో విడుదలైన బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా కనిపిస్తోందీ మూవీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ మూవీ హిట్ కొట్టినట్టే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ జంట బాగా పాపులర్ అయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, అండర్ స్టాండింగ్ నటనలో ఆవిష్కరించిన విధానం చాలా మెచ్యూర్డ్ గా నటించిన విధానం బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ జంట మరో మూవీతో రాబోతోంది.

యస్.. కపుల్ ఫ్రెండ్లీ నటనతో బాగా ఆకట్టుకున్న సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా మరో మూవీ రూపొందించబోతున్నాం అని చెప్పాడు నిర్మాత ధీరమ్ మొగిలినేని. ఈ నిర్మాత కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఆనందాన్ని పంచుకోవడంతో పాటుగా ఈ జంటతో మరో మూవీ చేయబోతున్నాం అని కూడా అనౌన్స్ చేశాడు. అంతే కాదు.. ఈ మూవీని కూడా వచ్చే వాలెంటైన్స్ డే సందర్భంగానే విడుదల చేస్తాం అన్నాడు. మామూలుగా ఇలాంటివి మాటలకే పరిమితం అవుతుంటాయి.మరి వీళ్లు మాటలకే పరిమితం అవుతారు లేక నిజంగానే సినిమా చేసి చెప్పిన టైమ్ కే విడుదల చేస్తారా అనేది చూడాలి. 

Tags:    

Similar News