Vijay : విజయ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడా..?

Update: 2026-04-13 11:39 GMT

తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల హడావిడీ ఉంది. ఈ ఎన్నికల్లో టివికే పార్టీని స్థాపించి పోటీలోకి నిలిపాడు అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్. గతంలోనే పార్టీని ప్రకటించాడు. అయితే ఆ టైమ్ లో అతను చెప్పిన మాట మాత్రం అభిమానుల్లో తీవ్రంగా నిరాశపరిచింది. ఇకపై సినిమాలు చేయను అన్నాడు. రాజకీయాల్లో మాత్రమే ఉంటాను అన్నాడు. ఆ క్రమంలో తన చివరి సినిమాగా జన నాయగన్ ను చెప్పాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ అంతా పాత సినిమాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇక విజయ్ సినిమాల నుంచి తప్పుకున్నట్టుగానే భావించారు. ఆ మాట మీదే నిలబడతా అని విజయ్ కూడా స్ట్రాంగ్ గా చెప్పాడు. కట్ చేస్తే ఆ మాట దాటేలా ఉన్నాడు. ఆ మాటకొస్తే మాట దాటేసినట్టుగానే చెబుతున్నారు.

యస్.. విజయ్ రాజకీయాల్లోనే ఆగిపోతాను అని చెప్పిన మాట నిలబెట్టుకోవడం లేదు. అతని 170వ సినిమాకు రెడీ అవుతున్నాడు. అంటే జన నాయగన్ 169వ సినిమా. ఫ్యాన్స్ అంతా అదే విషయాన్ని హైలెట్ చేశారు. 169వ సినిమా చివరిది అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా చేశాడు. కానీ అతను 170వ సినిమాకు సిద్దం అవుతున్నాడు. తమిళనాడులో ఎన్నికల తర్వాత అతను ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు. ప్రస్తుతం రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా తిరుగుతున్నాడు. తనతో పాటు తన అభ్యర్థులందరి విజయం కోసం పాటు పడుతున్నాడు. ఆ తర్వాత మూవీ అంటే అది కేవలం కేవీఎన్ ప్రొడక్షన్స్ కోసమేనట.

కేవీఎన్ బ్యానర్ జన నాయగన్ ను నిర్మించింది. ఇది ఆగిపోయింది. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతోంది. అదీ కాక ఏకంగా మూవీ అంతా లీక్ అయింది. దీంతో నిర్మాతకు చాలా పెద్ద నష్టం ఖాయం అని తేలిపోయింది. అఫ్ కోర్స్ ఆ మూవీని లీక్ చేసినవాళ్లందరినీ అరెస్ట్ చేశారు. అయినా జరిగిన నష్టం మాత్రం వెనుతిరిగి రాలేదు కదా. అందుకే అతని కోసం మరో సినిమా చేయాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముందుగా అట్లీని తీసుకోవాలనుకుంటున్నాడట. అట్లీ అంటే విజయ్ కోసం ఏమైనా చేస్తాడు కదా. అట్లీతో కుదరకపోతే లోకేష్ కనకరాజ్ లేదంటే నెల్సన్ దిలీప్ కుమార్ తో అయినా చేయాలనుకుంటున్నాడట. అదీ విషయం. విజయ్ మూవీస్ కు ఫుల్ స్టాప్ పెట్టబోవడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతే మాత్రం తర్వాత పవన్ కళ్యాణ్ లాగా మళ్లీ సినిమాలు చేయడానికి ముందుగా ప్రిపేర్ అవుతున్నట్టుగానే దీన్ని భావించాలి.

Tags:    

Similar News