దళపతి విజయ్ హీరోగా నటించిన మూవీ జన నాయగన్. ఎప్పుడో జనవరి 9నే విడుదల కావాల్సిన మూవీ ఇది. కానీ సెన్సార్ ఇష్యూస్ లో పడిపోయింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా సెన్సార్ నుంచి క్లియరెన్స్ రావడం లేదు. హై కోర్ట్ నుంచి సుప్రీమ్ కోర్ట్ వరకూ వెళ్లినా ఇదే సమస్య. మరోవైపు విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్నికలకు వెళుతున్నాడు. ఈ కారణంగానే ఈ మూవీని సెన్సార్ సమస్యల్లో చిక్కుకునేలా చేశారు అనే టాక్ కూడా ఉంది. ఇలా ఉంటే సడెన్ గా ఈ మూవీ లీక్ అయింది. మొత్తం సినిమా అంతా లీక్ అయింది. దీంతో నిర్మాతలు షాక్ తిన్నారు. అసలే సినిమా విడుదల కావడం లేదు.. తెచ్చిన డబ్బుకు వడ్డీలు కడుతున్నాం అని ఫీలవుతున్న ప్రొడక్షన్ హౌస్ కు ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇమ్మీడియొట్ గా ఈ లీక్ వెనక ఉన్న కారకులు ఎవరు అనేది తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైమ్ పోలీస్ లు కేస్ ను సీరియస్ గా తీసుకున్నారు. తక్కువ టైమ్ లోనే లీక్ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఈ మూవీ లీక్ కు సంబంధించిన 300లకు పైగా లింక్ లను కూడా బ్లాక్ చేశారు. వీరిని అరెస్ట్ చేయడంతో పాటు ఈ లీక్ వెనక ఉన్నది ఎవరు అని విచారిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత కు సంబంధించిన అన్ని విధాలుగా కోర్ట్ లో సబ్మిట్ చేయబోతున్నారు. మొత్తంగా ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఓ విధంగా గట్టెక్కింది. ఇలాంటివి మరీ ఆలస్యం చేసినా మొత్తంగా సమస్యలే తప్పవు. ఇప్పటికైనా సెన్సార్ వాళ్లు వీలైనంత త్వరగా క్లియరెన్స్ ఇస్తే బావుంటుంది.