హీరోలతో ఇష్యూస్ అయితే మాత్రం వెంటనే హీరోయిన్లను తప్పించడం కామన్. అలాగే కల్కి మూవీలో దీపికా పదుకోణ్ ను తప్పించారు. కల్కి చిత్రంలో దీపికా నటించింది. ఈ మూవీలో తన పాత్ర బావుంది.మంచి నటన కూడా చూపించింది. అయితే ఆ మధ్య కేవలం 8 గంటలు మాత్రమే పనిచేయాలి అని చేసిన కామెంట్స్ రగిలిపోయారు జనం. ముఖ్యంగా స్పిరిట్ మూవీలో తను 8 గంటలు నటించాలి అని చెప్పింది. అంతే ఆ మూవీ నుంచి తప్పించారు. దీంతో పాటు ఆ మూవీలో హీరోగా చేసిన ప్రభాస్ మూవీ కల్కిలో కూడా తప్పించారు. ఇది ఓ రకంగా దారుణం అని చెప్పాలి. అయితే ఇప్పుడా ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకుంటారు అనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో నటిస్తుంది. దీంతో పాటు ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఏక్ దిన్ మూవీలో నటిస్తోంది. ఏక్ దిన్ మే 1న విడుదల కాబోతోంది. అయితే ఇతర భాషల్లో పెద్దగా ప్రాధాన్యం లేని మూవీస్ కు నో చెబుతోంది. వీటితో కల్కి 2 లో మాత్రం సాయి పల్లవిని తీసుకోబోతున్నారు అని చెబుతున్నారు. ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే సాయి పల్లవి చేయడానికి ఒప్పుకుంది అంటున్నారు. మరి తను ఓకే చేస్తుందా లేదా అనేది చూడాలి.