Sonu Sood' Fateh : సోనూసూద్ సినిమాకు బంపర్ ఆఫర్

Update: 2025-01-09 11:07 GMT

ఇండియన్ మూవీస్ లో విలన్ గా తిరుగులేని స్టార్డమ్ ఉన్న నటుడు సోనూసూద్. కరోనా టైమ్ లో అతను చేసిన సామాజిక సేవ అతన్ని ఇండియాస్ హీరోగా మార్చాయి. రియల్ హీరో అన్నారు అంతా. అలాంటి సోనూసూద్ ఇప్పుడు హీరోగా మారాడు. తనే నిర్మిస్తూ డైరెక్షన్ కూడా చేసి రూపొందించిన ఆ సినిమా ‘ఫతే’. ఈ శుక్రవారం గేమ్ ఛేంజర్ తో పాటుగా విడుదలవుతోంది. అయితే ఈ మూవీని కేవలం హిందీ వరకే పరిమితం చేశాడు సోనూసూద్. ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేసినా యాక్షన్ ఎపిసోడ్స్ తో ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ చేశాడు. ఈ మధ్య వచ్చిన మళయాల మూవీ మార్కో లాగా వెండితెరను రక్తంతో ముంచెత్తబోతున్నాడు అనేలా ఉంది ట్రైలర్ చూస్తే. సోనూ ఓ ఏజెంట్ గా నటిస్తున్నట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఫస్ట్ డే ఓ బంపర్ ఆఫర్ పెట్టాడు సోనూ.

శుక్రవారం రోజు మాత్రమే ఈ మూవీ టికెట్ ను కేవలం 99 రూపాయలుగా ఫిక్స్ చేశాడు. హీరోగా స్టార్డమ్ లేకపోయినా.. విలన్ గా క్రేజ్ ఉంది. రియల్ హీరోగా గొప్ప పేరుంది. అలాంటి తను ఓపెనింగ్స్ కోసం చేసిన ప్రయత్నం ఇది. ఫస్ట్ డే ఎవరైనా టికెట్ రేట్లు పెంచుకుంటారు.కానీ సోనూసూద్ తగ్గించాడు. 99 రూపాయలకే తన సినిమా చూసే ఆఫర్ ప్రకటించాడు. కాకపోతే మళ్లీ శనివారం నుంచి ఆయా ప్రాంతాల్లోని థియేటర్స్ లో ఎలాంటి టికెట్ రేట్లు ఉంటాయో అవే అమలవుతాయి. బట్ సినిమా బావుంటే మంచి ఓపెనింగ్స్ తో పాటు తిరుగులేని మౌత్ టాక్ పబ్లిసిటీ రూపంలో వస్తుంది.

ఏదేమైనా ఈ చిత్రాన్ని సోనూసూద్ ఎక్కువగా ప్రచారం చేయలేదు అనే చెప్పాలి. హిందీలో కూడా అంత ప్రమోషన్స్ ఏం కనిపించలేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోట్ అయింది. మరి తను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన ఫతే ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. 

Tags:    

Similar News