Hari Hara Veera Mallu : అవును సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం..

Update: 2025-06-06 08:24 GMT

అంతా ఊహించినట్టుగానే అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు విడుదల వాయిదా వేస్తున్నామని అఫీషియల్ గానే ప్రకటించారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ.. ప్రస్తుతం ఈ నెల 12 నుంచి పోస్ట్ పోన్ అవుతున్నట్టు చెప్పారు. దాదాపు ఐదేళ్లుగా సాగుతూ వస్తోందీ మూవీ షూటింగ్. చివరికి గత నెలలోనే మిగిలిపోయిన తన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ పోర్షన్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాలేదు అనే కారణంతో వాయిదా వేశారు.

నిజానికి హరిహర వీరమల్లు వాయిదాకు సరైన బిజినెస్ కాకపోవడమే అనేది ఇన్ సైడ్ టాక్. ఈ మధ్య నిర్మాత ఏఎమ్ రత్నం ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. కానీ కంటెంట్ పరంగా బెటర్ ఇంపాక్ట్ కోసమే వాయిదా వేస్తున్నాం అని ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి బయ్యర్స్ లేని కారణంగానే ఇప్పటి వరకూ ట్రైలర్ కూడా కట్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించిన వర్క్స్ కూడా పట్టించుకోలేదు. మరోవైపు రిలీజ్ ప్రమోషన్స్ కు కూడా నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయం తెలిసే పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ నుంచి రీసెంట్ గా 11 కోట్లు నిర్మాతకు వెనక్కి ఇచ్చాడు. ఆ డబ్బుతో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోమని ఆయన ఉద్దేశ్యం. ఏదేమైనా ఈ జూన్ లో కొత్త డేట్ కష్టమే. ఇక జూలై లేదా ఆగస్ట్ వరకూ వెయిటింగ్ తప్పదు.

Tags:    

Similar News