Hyper Aadi : 'హైపర్ ఆది పై దాడి'.. స్పందించిన కమెడియన్..!
Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ లో అతను వేసే పంచులకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు.;
Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ లో అతను వేసే పంచులకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మనోడి స్కిట్లు యూట్యూబ్‌లో ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటాయి. జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటాడు. దీనితో హైపర్ ఆదికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఇదిలావుండగా గత మూడురోజులుగా హైపర్ ఆది పైన దాడి జరిగిందని, ఓ హీరో అభిమానులు ఆయన పైన దాడికి దిగారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇవి కేవలం వుట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు హైపర్ ఆది. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియోలో ఆది మాట్లాడుతూ... 'నాపై దాడి చేయడం కోసం ఎవరో వెతుకుతున్నారంటూ ఏవేవో ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయి. మీ ఫేక్ న్యూస్‌లు రాసేవారికి ఒకటే చెప్తున్నా.. మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, నేను సంపాదించేదాంట్లో కొంత తీసి మీకిస్తాను. మేమందం హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి, మేమూ హ్యాపీగా ఉన్నాం' అని చెప్పుకొచ్చాడు.