Shanthi Swaroop Jabardasth: జబర్దస్త్ కమెడియన్స్‌పై శాంతిస్వరూప్ సెన్సేషనల్ కామెంట్స్..

Shanthi Swaroop Jabardasth: జబర్దస్త్‌లో లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన కమెడియన్ శాంతి స్వరూప్.

Update: 2022-02-02 16:06 GMT

Shanthi Swaroop Jabardasth: జబర్దస్త్ అనే ఒక్క కామెడీ షో ఎంతోమంది అప్‌కమింగ్ కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. ఈ షో మొదలయ్యి ఇప్పటికీ ఎనిమిదేళ్లుపైనే అయినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా మంచి టీఆర్‌పీతో కొనసాగుతోంది. దీనివల్లే చాలామంది కమెడియన్లు స్టార్లు అయ్యారు. అలా జబర్దస్త్ వల్ల ఫేమ్ సంపాదించుకున్న వారిలో శాంతి స్వరూప్ కూడా ఒక్కరు. తాజాగా ఈ నటుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

లేడీ గెటప్స్ అనే ఒక అంశాన్ని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది జబర్దస్త్. ఈ కామెడీ షో మొదలయిన కొత్తలో ఇందులో ఒక్క అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేయలేదు. అందుకే షోకు కాస్త గ్లామర్ తేవడం కోసం అబ్బాయిలనే అమ్మాయిగా గెటప్ మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు టీమ్ లీడర్లు. దీంతో మెల్లగా అసలు అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు తెలియని పరిస్థితికి వచ్చేసింది.

అలా జబర్దస్త్‌లో లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన కమెడియన్ శాంతి స్వరూప్. తాజాగా శాంతి స్వరూప్ ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆ వీడియోను ఓ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ కూడా చేసింది. ఈ వీడియోలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు శాంతి స్వరూప్. లేడీ గెటప్‌లు వేసేవాళ్లే తనను పలుమార్లు అవమానించారన్న విషయాన్ని బయటపెట్టాడు ఈ జబర్దస్త్ నటుడు.

ఇంతకు ముందు తన డ్రీమ్ కారుతో ఒక వీడియో తీశాడు శాంతి. ఆ సమయంలో అసలు ఆ కారును తాకే అర్హత అయినా నీకు ఉందా అంటూ తనతో పనిచేసే కొందరు తనను దారుణంగా అవమానించినట్టు తెలిపాడు. వాళ్లలాగా తాను ఏ అడ్డదారుల్లో డబ్బు సంపాదించి కార్లు, నగలు కొనలేదని.. ఇప్పుడు తాను కొంటున్న కారు తన కష్టార్జీతం అని అన్నాడు శాంతి స్వరూప్. చెడ్డపనులు చేసి తానెప్పుడూ డబ్బు సంపాదించాలి అనుకోలేదని తనతో పనిచేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Tags:    

Similar News