Jabardasth Venu : అవకాశాల కోసం అంట్లు తోమాను, బాత్రూంలు కడిగాను : వేణు
Jabardasth Venu : ఇండస్ట్రీలో అవకాశాల కోసం అంట్లు తోమాను, బాత్రూంలు కడిగానని చెప్పుకొచ్చారు కమెడియన్ వేణు..;
Jabardasth Venu : ఇండస్ట్రీలో అవకాశాల కోసం అంట్లు తోమాను, బాత్రూంలు కడిగానని చెప్పుకొచ్చారు కమెడియన్ వేణు.. ఇటీవల ఓ యూట్యుబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమీ తెలియదని.. కానీ స్క్రీన్ పైన కనిపించాలాన్న ఓకే ఒక్క ఉద్దేశ్యంతో సినిమాల్లోకి వచ్చానని చెప్పారు.
చిత్రం శీను దగ్గర టచప్ బాయ్ గా పనిచేశానని తెలిపాడు.. అంతేకాకుండా మేకప్ అసిస్టెంట్‌గా, సెట్ బాయ్‌గా రూ. 70కి కూలీగా కూడా పనిచేశానని తెలిపాడు. అవకాశాల కోసం ఇండస్ట్రీలో వ్యక్తులను పరిచయం చేసుకుని వాళ్ల రూమ్‌లో ఉన్నానని.. కానీ వాళ్ళు ఇంట్లో పని చేసే బాయ్‌గా ఉంచుకున్నారని తెలిపాడు.
కాగా జై సినిమాతో నటుడిగా పరిచయమైన వేణు మున్నా సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక జబర్దస్త్ షోతో స్టార్ స్టేటస్ చూశాడు. ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్న సుధీర్, గెటప్ శీనులను పరిచయం చేసింది వేణునే.