మైథలాజికల్ టచ్ తో మంచి కథ, కథనాలతో వస్తే ఆడియన్స్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. ఆ క్రమంలో మరో సినిమా రాబోతోంది. మూవీ టైటిల్ ‘యముడు’.ధర్మో రక్షతి రక్షితః అనేది క్యాప్షన్. జగన్నాధ పిక్చర్స పతాకంపై జగదీష్ ఆమంచి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ హీరోగా నటిస్తోన్న చిత్రం ఇది. శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో పోస్టర్ ను లాంచ్ చేశారు.
గతంలో రిలీజ్ చేసిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన ఈ పోస్టర కూడా పవర్ ఫుల్ గా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో జగదీష్ అందరినీ భయపెట్టించేశారు. వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఇలా అన్నీ కూడా మంచి డిజైనింగ్ తో కంటెంట్ కు తగ్గ సెటప్ లా ఉన్నాయి.
హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేసిన తీరు, యముడి ఆహార్యంలో హీరో కనిపించిన తీరు గూస్ బంప్స్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.