Jagapathi Babu : షూటింగ్‌‌‌కి తాగొచ్చిన జగపతిబాబు.. కట్ చేస్తే నంది అవార్డు..!

Jagapathi Babu : ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ.

Update: 2021-10-16 12:07 GMT

Jagapathi Babu : ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. అందులో భాగంగానే 1998లో ఆయన నుంచి వచ్చిన చిత్రం అంతఃపురం.. ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయికుమార్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమాకి ఏకంగా తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. నాట్ విత్ మై డాటర్ అన్న 1991 నాటి అమెరికన్ చిత్రంలోని పాయింట్ ఆధారంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు కృష్ణవంశీ.

ఇందులో సారాయి వీర్రాజు పాత్రలో నటించి మెప్పించాడు జగపతి బాబు.. 'గాయం' సినిమాకి కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో సినిమాలో ఈ పాత్ర చేసేందుకు ఇష్టపడ్డారు జగపతిబాబు.. అప్పటివరకు జగపతిబాబు అంటే ఓ ఫ్యామిలీ హీరోగానే ప్రేక్షకులు చూశారు. కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా, చాలా విభిన్నంగా చూపించి కొత్త జగపతిబాబును ప్రేక్షకులకి పరిచయం చేశారు కృష్ణవంశీ. జగపతిబాబు గురించి మాట్లాడకుండా అంతఃపురం సినిమా గురించి మాట్లాడలేము కూడా... అంతలా ప్రేక్షకులకి రిజిస్టర్ అయింది ఆ పాత్ర. అయితే సినిమా చేసిన అయిదు రోజులు పాటు జగపతిబాబు తాగి వచ్చి మరి యాక్ట్ చేశాడట.

స్వయంగా తానే జగపతిబాబుకి మందు ఇచ్చానని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సారాయి వీర్రాజు పాత్రకి గాను ఉత్తమ సహాయ నటుడుగా జగపతిబాబుకి నంది అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాని అంతఃపురం పేరుతో రీమేక్ చేయగా జగపతిబాబు స్థానంలో పార్థిబన్ నటించారు.. ఇదే సినిమాని హిందీలో శక్తి: ది పవర్ (2003) పేరుతో రీమేక్ చేయగా షారుఖ్ ఖాన్ మరియు కరిష్మా కపూర్‌ కలిసి నటించారు. జగపతిబాబు పాత్రని అక్కడ షారుఖ్ ఖాన్ పోషించడం విశేషం. అక్కడ కూడా కృష్ణవంశీనే ఈ సినిమాని తెరకెక్కించడం మరో విశేషం. 

Tags:    

Similar News